Home » Medical News
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా డీహెచ్ పరిధిలోని 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతోపాటు 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
త్వరలో వైద్యవిద్య ప్రవేశాల నోటిఫికేషన్ రానుండగా.. ‘ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)’ కోటా అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది కూడా కోటా పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో యూజీలో 572, పీజీలో 180 సీట్లను ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోనున్నారు.
నీట్ అక్రమాలు, పేపర్‌లీక్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వం నీట్ కుంభకోణాన్ని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఎ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నీట్ అక్రమాలపై ఆయన సర్కారును ఉద్దేశించి ‘ఎక్స్’లో ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘
ఈ ఏడాది నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల వద్ద సమయాన్ని కోల్పోయిన 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది.
వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(NEET)లో ఇకపై గ్రేస్ మార్కులు ఉండబోవని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. నీట్, యూజీ 2024 పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నీట్ కౌన్సెలింగ్‌ని ఆపేది లేదని కోర్టు స్పష్టం చేసింది.
నకిలీ మందుల తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయడానికి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇటీవలే కొత్తగా ఉద్యోగాలు సాధించిన 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సోమవారం మంత్రి నియామక పత్రాలను అందజేశారు.
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్-యూజీ పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ అథారిటీ (ఎన్టీఏ) గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలయింది. సమయాన్ని నష్టపోయారన్న (‘లాస్ ఆఫ్ టైమ్’) కారణం చూపించి ఎన్టీఏ 1,536 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చింది.
గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. వారి మూల వేతనంపై 50ు వేతనం పెంచాలని రాష్ట్ర సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థులుగా ఉండటం, బీపీ నియంత్రణ లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు.
నీట్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో కీలకమైన స్థానికత అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చింది.