Share News

Hyderabad: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:06 AM

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థులుగా ఉండటం, బీపీ నియంత్రణ లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు.

Hyderabad: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స

  • బీపీ పెరిగి తీవ్ర అస్వస్థతకు లోనైన ఈనాడు సంస్థల అధినేత

  • నానక్‌రాంగూడ స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స

  • గుండెకు స్టెంట్‌ ఇతర సమస్యలు

  • తలెత్తడంతో వెంటిలేటర్‌ మీద ఉంచాలని నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థులుగా ఉండటం, బీపీ నియంత్రణ లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆయన గుండెకు స్టెంట్‌ వేశారు. రక్తపోటు నియంత్రణలోకి వచ్చినప్పటికీ ఇతర సమస్యలు తలెత్తడంలో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


కొన్నేళ్ల క్రితం ఆయన కోలన్‌ క్యాన్సర్‌ బారినపడి చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ తర్వాత విధులకు కూడా హాజరవుతున్నారు. రామోజీరావు వయసు 88 సంవత్సరాలు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయన నాలుగు రోజుల క్రితం వరకు మామూలుగానే ఉన్నట్లు సమాచారం.

Updated Date - Jun 08 , 2024 | 05:58 AM