Home » Medical News
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది(జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు)కి వేతన కష్టాలు తీరనున్నాయి. ప్రతినెలా మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైపెండ్ చెల్లించేలా ‘గ్రీన్ చానల్’ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
ఆసుపత్రికి వచ్చే ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి గర్భిణులకు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలందించి తల్లీబిడ్డను రక్షించడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లావైద్యాదికారి డాక్టర్ మంజువాణి సూచించారు. బుధవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
: రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల విషయంలో స్థానికత, ఈడబ్ల్యూఎస్ కోటాపై సర్కారు నుంచి స్పష్టత కరువైంది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఫలితాలు జూన్ 14న రానున్నాయి. తర్వాత వారం, పది రోజుల్లోనే హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అంటే.. సరిగ్గా నెల రోజుల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల కానుంది.
రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ హబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో.. కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు.
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు తీవ్రభయాందోళనతో గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావొద్దని భారత విద్యార్థులను కిర్గిస్థాన్‌లోని భారత ఎంబసీ సూచించింది.
అరవైఏళ్లు పైబడిన టీబీ వ్యాధిగ్రస్థులు త ప్పనిసరిగా బీసీ జీ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని డీఎంహెచఓ మంజువాణి సూచిం చారు. ఆమె గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీచేసి బీజీజీ టీకాపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇదివర కే టీబీ సోకిన చక్కెర వ్యాధి గ్రస్థులు, ధూమపానం చేయువారు, బాడి మాస్ ఇండెక్స్ 18కన్నా తక్కువ ఉన్నవారు టీకా తీసుకోవచ్చన్నారు.
చేతికి అదనంగా ఉన్న వేలు తొలగించాలని తల్లిదండ్రులు తమ కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్తే.. వైద్యులు నిర్లక్ష్యంతో నోటి ఆపరేషన్ చేసిన ఘటన కేరళలో(Kerala) చోటు చేసుకుంది. కోజికోడ్‌కి చెందిన ఓ బాలిక చేతికి అదనంగా మరో వేలు ఉంది.
లోక్‌సభ 2024 ఎన్నికలకు(lok sabha elections 2024) ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో గుండె, కాలేయం, మధుమేహం సహా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలను(medicines rates) తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
నిబంధనల ప్రకారం లేని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) జరిమానాల కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రంలోని ఈ కాలేజీలను ఎన్ఎంసీ వర్చువల్ పద్ధతిలో తనిఖీ చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 9 మినహా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఈ తనిఖీలు పూర్తయినట్లు ఎన్ఎంసీ వర్గాలు వెల్లడించాయి. గాంధీ, ఉస్మానియాతో పాటు గత ఏడాది కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలలను కూడా తనిఖీ చేశారు.
హైదరాబాద్ మలక్‌పేటలోని బీబీ క్యాన్సర్ ఆస్పత్రితో ప్రముఖ రెనోవా హాస్పిటల్స్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు రెనోవా హాస్పిటల్స్ చైర్మన్, ఎండీ డాక్టర్ పి.శ్రీధర్ ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న బీబీ క్యాన్సర్ ఆస్పత్రిని అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి రెనోవా బీబీ క్యాన్సర్ ఆస్పత్రిగా ప్రారంభించినట్లు తెలిపారు.