Home » MLA Candidates
కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారికే క్యాబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ రెండు అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి అందించామని చెప్పారు.
మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రావాలంటే అదృష్టం కూడా ఉండాలని, నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అన్నారు.
‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్ కావద్దు’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు.
బీఆర్‌ఎస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.
అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు! మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు! ఇప్పటికే ఐదుగురు పార్టీని వీడగా.. మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది!
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సీఎం.. 2 రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే.. గులాబీ పార్టీ ముఖ్యనేత కవితకు అత్యంత సన్నిహితుడు.. డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్‌ఎస్ నుంచి మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. బీఆర్‌ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు.
ఈడీ, ఐటీల పేరుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.
ఈనెల 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అధ్యక్షతన ఈనెల 19న ఉదయం 10:30గంటలకు తాడేపల్లి(Tadepalli) క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.