Share News

Kurnool : వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ అరెస్టు

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:56 AM

యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను టూటౌన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Kurnool : వైసీపీ మాజీ ఎమ్మెల్యే  సుధాకర్‌ అరెస్టు

  • యువతిపై లైంగిక వేధింపులు

  • 14 రోజుల రిమాండ్‌, కర్నూలు జైలుకు తరలింపు

  • పోలింగ్‌ రోజు సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

  • ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

  • యువతిపై లైంగిక వేధింపుల కేసులో

  • 14 రోజుల రిమాండ్‌, కర్నూలు జిల్లా జైలుకు తరలింపు

కర్నూలు, జూలై 4: యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను టూటౌన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయన ఓ యువతిని లైంగికంగా సహకరించాలని బలవంతం చేసినట్టుగా ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో పాటు ఆ యువతి ఇటీవలే పోలీసులను ఆశ్రయించి మూడేళ్లుగా సుధాకర్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తాను భయపడి అప్పట్లో ఫిర్యాదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని, ఇప్పుడు మేజర్‌ కావడంతో ధైర్యంగా ముందుకు వచ్చినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో సుధాకర్‌ను ఉదయమే కర్నూలు టూటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా న్యాయాధికారి ఎదుట హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు ఆయన్ను కర్నూలు శివారులోని పంచలింగాలలోని జిల్లా జైలుకు తరలించారు.


ఉదయం నుంచి ఉత్కంఠ: సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం నుంచి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన అరెస్టుపై గోప్యత పాటిస్తూ మీడియాకు వివరాలు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయనను పలు చోట్ల తిప్పుతూ రాచమర్యాదలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో వైద్యపరీక్షలు చేయించారు. అక్కడి నుంచి నేరుగా ఓర్వకల్లు పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ సాయంత్రం దాకా ఉంచారు. ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలతో కూడిన పోలీసు బృందం సుధాకర్‌ అరెస్టును మీడియా కంట పడనీయకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బృందంలోని ఓ పోలీసు అధికారి మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

పోలింగ్‌ రోజు నుంచే వీడియో వైరల్‌..!: సుధాకర్‌ ఓ యువతిని తన గదిలోకి తీసుకెళ్లి హత్తుకుంటూ లైంగికంగా వేధించినట్టు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పోలింగ్‌ ముగిసిన రోజు సాయంత్రం ఆ వీడియోను సోషల్‌ మాద్యమాల్లో పోస్టు చేశారు. ఆ తర్వాత సుధాకర్‌తో పాటు మరికొంత మం ది బాధిత యువతి కుటుంబంతో బలవంతంగా రాజీ చేయించినట్టు సమాచారం. అయినప్పటికీ తనకు న్యాయం జరగాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Updated Date - Jul 05 , 2024 | 02:56 AM