Home » Money Laundering Cases
మనీ లాండరింగ్ కేసుల్లో విచారాణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు బుధవారంనాడు అసహనం వ్యక్తం చేసింది. విచారణ లేకుండా నిందితులను జైల్లలోనే ఉంచడం, డీపాల్డ్ బెయిల్ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేయడాన్ని నిలదీసింది.
మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2018 మనీ ల్యాండరింగ్ కేసును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద డీకే శివకుమార్‌పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.
భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీల్యాండరింగ్ కోణంలో ప్రశ్నించేందుకు తొమ్మిది సార్లు నోటీసులు పంపించినా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించకపోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం పదవితో పాటు జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
‘వివో’ మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి భారతదేశంపై డ్రాగన్ కంట్రీ చైనా సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. చైనా కంపెనీల పట్ల వివక్ష చూపవద్దని భారత్‌ను గట్టిగానే కోరిన చైనా.. తాము ఈ విషయాన్ని నిశితంగా...
కాన్-మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిక్కుకున్న విషయం తెలిసిందే. అతనితో సన్నిహితంగా మెలిగిన పాపానికి.. ఆమెకు ఈ నరకం తప్పట్లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు విచారణకు...
దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు పంపిన నోటీసులపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమైనవని, రాజకీయంగా ప్రేరేపించినవని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
మనీలాండరింగ్(Money Laundering) కేసులో జెట్ ఎయిర్‌వేస్‌కి(Jet Airways) చెందిన రూ.538 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కెనరా బ్యాంక్ లిఖిత పూర్వక ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ(ED) విచారణ ప్రారంభించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను మనీలాండరింగ్, మద్యం పాలసీ కేసులు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తాజాగా మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత సత్యేంద్ర జైన్(Satyendra Jain)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించింది. అక్టోబర్ 9 వరకు బెయిల్ పొడిగింపును మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తొలుత మే 26న మెడికల్ బెయిల్(Bail) మంజూరు చేశారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీం కోర్టులో చుక్కేదిరైంది. మనీలాండరింగ్ సంబంధించిన కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను ఆయన వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు ఈ అంశంపై జార్ఖండ్ హై కోర్టుకు వెళ్లాలని సూచించింది.