Share News

Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Mar 05 , 2024 | 03:26 PM

మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2018 మనీ ల్యాండరింగ్ కేసును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద డీకే శివకుమార్‌పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.

Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో (Money Laundering Case) కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు (DK Shivakumar) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట కలిగింది. 2018 మనీ ల్యాండరింగ్ కేసును (Money Laundering Case) సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద డీకే శివకుమార్‌పై (DK Shivakumar) మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.

ఏం జరిగిందంటే..?

2017 ఆగస్టులో ఢిల్లీలో గల డీకే శివకుమార్ ఇంట్లో లెక్కల్లో చూపని నగదు భారీగా పట్టుబడింది. డీకే శివకుమార్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది. తర్వాత ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. పట్టుబడిన నగదుకు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. ఆ కేసులో విచారణకు హాజరుకావాలని డీకే శివకుమార్‌కు సమన్లు జారీచేశారు. విచారణ నుంచి తప్పించాలని కర్ణాటక హైకోర్టును డీకే శివకుమార్ ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురు అయ్యింది. దీంతో సుప్రీంకోర్టును డీకే శివకుమార్ ఆశ్రయించారు. కేసు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. డీకే శివకుమార్ ఇంట్లో దొరికిన నగదుతో మనీ ల్యాండరింగ్ జరిగినట్టు నిరూపించలేదని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Karnataka: పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించిన ముగ్గురి అరెస్ట్.. ఎలా నిర్ధారించారు..?

సీబీఐ కూడా

డీకే శివకుమార్ కేసులో ఈడీ తర్వాత సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. డీకే శివకుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని సీబీఐ అధికారులు అనుమతి కోరారు. 2019 సెప్టెంబర్‌లో డీకే శివకుమార్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారం రోజుల తర్వాత డీకే శివకుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానిని డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురు కాగా.. సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. కేసును సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం విచారించి, ఆధారాలు లేవని కొట్టివేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 03:36 PM