Home » Mumbai
తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలే. ఎదిగిన సరే బిడ్డలపై మమకారం చూపిస్తుంటారు. కళ్లముందు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరిగింది.
కోల్ కతాలో వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైద్య సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. నిందితుడు సంజయ్ రాయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ.. ఇంతలో మరో వైద్యురాలిపై దాడి జరిగింది.
కొంత మంది అయితే చిన్న చిన్న కారణాలకే సూసైడ్ వరకు వెళ్తున్నారు. తాజాగా కూడా ఓ 57 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుందామని ఓ క్యాబ్‌లో బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి, తర్వాత క్యాబ్ డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి నదిలోకి దూకేసింది. వెంటనే అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్ ఆమె జట్టు పట్టుకుని ఆమె ప్రాణాలను కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) తరఫున సీఎం అభ్యర్థి ఎవరో ముందుగానే తేల్చాలని మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు.
దశరథ్ గిరి మరణ వార్తను వారణాసిలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలంకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇక ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు మిగిలిన ప్రయాణికులతో ఈ విమానం ముంబయి బయలుదేరి వెళ్లిందన్నారు.
ముంబయి నుంచి లండన్‌కు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్.. ముంబయిలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి.. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు.
పొరుగునున్న బంగ్లాదేశ్‌లో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భారీగా భారత్.. తన బలగాలను మోహరించింది. అలాంటి వేళ.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ ఉస్మాన్ కరామట్ అలీ బిశ్వాస్‌గా అతడిని గుర్తించారు.
ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడదామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.
పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అని పెద్దలు అంటుంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు తాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు వారి పిల్లలు ప్రమాదంలో పడడానికి కారణమవుతుంటారు. ఆడుకుంటూ మేడ పైనుంచి కింద పడి కొందరు, ఎవరూ గమనించని సమయంలో...
కళాశాలకు వచ్చే విద్యార్థులు ‘హిజాబ్, బుర్ఖా, నఖాబ్, టోపీ’ వంటివి ధరించవద్దంటూ ఓ ముంబై కాలేజీ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉందని స్పష్టం చేసింది.