Home » Nalgonda
ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న అందరికి మాఫీ అయ్యిందని వివరించారు. రెండో దఫాలో రూ.2 లక్షల వరకు లోన్ తీసుకున్న వారికి మాఫీ అవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. రైతుల మేలు కోరి రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతలో లక్ష రుణ మాఫీ ప్రక్రియలో నల్లగొండ నుంచి అత్యధిక మొత్తంలో రుణాలు మాఫీ అయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సోమవారం ఉదయం సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.
భువనగిరి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు.
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు.
Telangana: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని మాజీ మంత్రి మోత్కపల్లి నర్సింహులు గురువారం దర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో తన జన్మదినం సందర్భంగా సన్నిధి హోటల్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ... ‘‘గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బిక్షమయ్యగౌడ్, బీర్ల ఐలయ్యలకు సపోర్ట్ చేసి గెలిపించాను’’ అని అన్నారు.
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జాతీయ రహదారులపై ఆగి ఉన్న వాహనాల్లోని వాహనదారులపై రాళ్లతో దాడి చేసి చోరీలకు పాల్పడుతూ, ప్రతిఘటించిన వారి ప్రాణాలు తీస్తున్న పార్దీ గ్యాంగ్ అనే దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
Telangana: భాగ్యనగరంలోని పెద్ద అంబర్పేటలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై పార్థ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దుండగులను పట్టుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.