TS News: పెద్ద అంబర్‌పేటలో కాల్పుల కలకలం... అసలు విషయం ఇదీ!
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:50 AM
Telangana: భాగ్యనగరంలోని పెద్ద అంబర్‌పేటలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై పార్థ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దుండగులను పట్టుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.
హైదరాబాద్, జూలై 5: భాగ్యనగరంలోని (Hyderabad) పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై పార్థ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దుండగులను పట్టుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆపై గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్య కేసుకు సంబంధించి పార్థ గ్యాంగ్‌ను నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకునేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
CM Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏం జరిగిందంటే..
కాగా.. నెల రోజుల క్రితం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసాని గూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారి ప్రక్కన మినీ ట్రాన్స్‌పోర్టు వాహనం ఆపిన కొల్లూరి రాజా వర్ధన్(35)ను దుండగులు హత్య చేసి పారిపోయారు. రూ.10 వేల కోసం దొంగలతో పోరాడిన రాజవర్ధన్ తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుడు కృష్ణాజిల్లా పామూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పార్థ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. వెంటనే దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. పెద్ద అంబర్ పేటలో పార్థ గ్యాంగ్ ఉన్నట్లు గుర్తించారు.
Rare Disease: బాలుడికి అరుదైన వ్యాధి.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
దీంతో అక్కడకు చేరుకున్న నల్గొండ క్రైమ్ బ్యాంచ్ పోలీసులు.. చాకచక్యంగా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు యత్నించింది. అయితే పోలీసులు వచ్చిన విషయాన్ని గుర్తించిన దుండగులు... ఖాకీలపైనే కత్తులతో దాడి చేసేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. గాల్లోకి కాల్పులు జరిపి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల మోత మోగడంతో స్థానిక ప్రజలు భయబ్రాంతాలకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి...
Chennai: తమిళనాడులో తెలుగును బతికించండి.. చంద్రబాబుకు కేతిరెడ్డి వినతి
Bhanuprakash: శ్రీవారి ఆభరణాలను తనిఖీ చేయాల్సిందే..
Read Latest Telangana News And Telugu News