Share News

Nalgonda: తొలివిడతలో నల్లగొండకు అత్యధిక నిధులు!

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:13 AM

రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతలో లక్ష రుణ మాఫీ ప్రక్రియలో నల్లగొండ నుంచి అత్యధిక మొత్తంలో రుణాలు మాఫీ అయ్యాయి.

Nalgonda: తొలివిడతలో నల్లగొండకు అత్యధిక నిధులు!

  • 83,124 మంది రైతులకు రూ.454కోట్లు బదిలీ

హైదరాబాద్‌, హుస్నాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతలో లక్ష రుణ మాఫీ ప్రక్రియలో నల్లగొండ నుంచి అత్యధిక మొత్తంలో రుణాలు మాఫీ అయ్యాయి. ఈ జిల్లాలో 78,463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు రూ.454.49 కోట్లు మాఫీ చేశారు. రెండు, మూడు స్థానాల్లో వరుసగా సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలున్నాయి. సిద్దిపేట జిల్లాలో 50,295 కుటుంబాలకు చెందిన 53,137 మంది రైతులకు రూ. 290.24 కోట్లు.. సూర్యాపేట జిల్లాలో 52,418 కుటుంబాల్లోని 56,274 మంది రైతులకు రూ. 282.98 కోట్ల రుణమాఫీ జరిగింది. చివరి స్థానంలో మేడ్చల్‌ జిల్లా ఉంది.


ఈ జిల్లాలో 2,667 కుటుంబాలకు చెందిన 2,781 మంది రైతులకు రూ.12.53 కోట్లు మాఫీ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధిక మొత్తంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అందోల్‌ పరిధిలో 19,186 కుటుంబాలకు చెందిన 20,216 మంది రైతులకు రూ. 107.83 కోట్ల రుణమాఫీ జరిగింది. రెండోస్థానంలో కరీంనగర్‌ జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌ ఉంది. ఈ నియోజకవర్గం నుంచి 18,101 కుటుంబాల్లోని 18,907 ఖాతాలకు చెందిన 106.74కోట్లు మాఫీ అయినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. రుణమాఫీకి సంబంధించి ఫిర్యాదుల కోసం రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఐటీ పోర్టల్‌ ఏర్పాటుచేశా

Updated Date - Jul 19 , 2024 | 03:13 AM