Home » Nalgonda
పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) బీఆర్ఎస్ను(BRS) వీడటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా స్పందించారు. ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియదని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరం అన్నారు.
సాధారణంగా దినసరి కూలీలు.. ఉద్యోగం లేకుండా గ్రామాల్లో ఖాళీగా ఉండే వ్యక్తులు ఉపాధి హామీ పనికి వెళ్తారనేది మనందరికీ తెలుసు. అందుకే దీనిని కరువు పని అని కూడా అంటారు. ప్రజలు కరువులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. అయితే తెలంగాణలోని సూర్యపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఉపాధి హామీ పనిలో ఓ ఐఆర్ఎస్ అధికారి ప్రత్యక్షమయ్యారు.
మద్యం మత్తులో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై సతీశ్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది.
విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ(Kaleswaram project)పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని భావించిన తన ఆకాంక్షలకు పేదరికం అడ్డొచ్చిందని.. విదేశాల్లో శిక్షణ, ఉపాధి కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకోలేకపోయానన్న ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది.
శాసనమండలి నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్)కు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి.