Home » Nalgonda
విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ(Kaleswaram project)పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని భావించిన తన ఆకాంక్షలకు పేదరికం అడ్డొచ్చిందని.. విదేశాల్లో శిక్షణ, ఉపాధి కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకోలేకపోయానన్న ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది.
శాసనమండలి నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్)కు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి.
వర్షానికి తడవకుండా ఉండేందుకు చెట్టుకిందకు వెళితే ఒకరు.. తడుస్తూనే పొలంలోనే విత్తనాలు విత్తుతూ మరొకరు.. పశువులను కాస్తూ మరొకరు ఇలా పిడుగుపాట్లకు రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. గురువారం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పలుచోట్ల వర్షాలు పడ్డాయి.
నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రాన్ని తొలకరి పలకరించింది. పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. సాయంత్రం వేళ గంటన్నర పాటు కుండపోత వానతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. బేగంబజార్‌లో అత్యధికంగా 8.8, బండ్లగూడలో 8.1, సర్దార్ మహల్లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం పడింది.
వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) 7670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్లో తీన్మార్ మల్లన్నకు 36,210, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.