Share News

Nalgonda: తీన్మార్‌ మల్లన్న ముందంజ ..

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:06 AM

వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) 7670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.

Nalgonda: తీన్మార్‌ మల్లన్న ముందంజ ..

  • తొలి రౌండ్‌లో 7,670 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్న

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

  • తొలి రౌండ్‌లో 7670 ఓట్లతో తీన్మార్‌ మల్లన్న ముందంజ

నల్లగొండ, జూన్‌ 5: వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) 7670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి. నల్లగొండ సమీపంలోని అనిశెట్టిదుప్పలపల్లి గోదాముల వద్ద ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. గత నెల 27న జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎ్‌సతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 52 మంది పోటీ చేశారు. మొత్తం 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు కోసం 96 టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు.


ప్రతీ రౌండ్‌లో 96 వేల ఓట్లు లెక్కింపు పూర్తి అవుతుంది. ఈ లెక్కన నాలుగు రౌండ్లలో మొదటి ప్రాధాన్య ఓట్ల ఫలితం రానుంది. 25 ఓట్లను ఓ కట్టగా కట్టే ప్రక్రియ బుధవారం సాయంత్రం నాలుగింటికి పూర్తవ్వగా.. ఓట్ల లెక్కింపు సాయంత్రం ఐదు గంటలకు మొదలైంది. ముందుగా తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. ఇందులో విజేత ఎవరో తేలకపోతే నిబంధనల ప్రకారం ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపును ఎలిమినేషన్‌ ప్రక్రియలో చేపడతారు.

Updated Date - Jun 06 , 2024 | 04:06 AM