Home » Narendra Modi
మోదీ సింగపూర్ పర్యటనలో భాగంగా వాంగ్‌తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. మోదీకి వాంగ్ ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్నారు. సింగపూర్‌లో అడుగుపెట్టగానే మోదీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
రెండు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగ్నేయాసియా దేశమైన బ్రూనై చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ఘనస్వాగతం పలికారు. బ్రూనే దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.
సెబీ చీఫ్ మాధవి పురీపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలి హోదాలో, ప్రస్తుతం సెబీ చైర్మన్ హోదాలోనూ ఆమె ఐసీఐసీఐ నుంచి ఏడేళ్లుగా జీతం తీసుకుంటున్నారని ఆరోపించింది.
బీజేపీ ఎన్నికల మిషన్ కాదని, అలా చెప్పడం పార్టీని అవమాన పరచడమేనని, పార్టీ కార్యకర్తల కృషి, ధైర్యం ఫలితంగానే ఎన్నికల్లో గెలుపు ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతి కలలను తీర్మానాలుగా రూపొందించుకుని, వాటిని సాధించడం, అందుకోసం పూర్తి అంకితభావంతో పనిచేయడం చేయాలన్నారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమం ''సంఘటన్ పర్వ, సదస్యత అభియాన్ 2024'ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ప్రారంభించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు.
రూ.3,300 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న కీన్స్ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ యూనిట్ రోజుకు 60 లక్షల చిప్‌లను ఉత్పత్తి చేయనుంది.
మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్టవుతుందని అన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కెనెక్టివిటీని మరింత పెంచే మూడు వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. మీరట్ సిటీ-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.