Home » National News
దేశ నూరవ స్వాతంత్ర్య దినోత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో యావద్దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో జార్ఖాండ్ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెట్టింపు అవుతుందని చెప్పారు.
రాజకీయ వ్యూహకర్త, జాన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా తన ఫీజుల గురించి వెల్లడించారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా నేతలకు సలహాలు ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుంటానో వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
శ్రీనగర్‌లోని గ్రనేడ్ దాడిపై డీజీపీ నలిన్ ప్రభాత్, భద్రతా ఏజెన్సీల సీనియర్ అధికారుతో లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడినట్టు ఆయన కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపాయి. టెర్రరిస్టులను, వారి అసోసియేట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్టు చెప్పారు.
బ్రిస్బేన్ లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగించడంలో ఇరుదేశాలు కొంత పురోగతి సాధించినట్టు చెప్పారు
ప్రియాంకను గెలిపిస్తే వయనాడ్‌కు ఉత్తమ ఎంపీ ఆమె అవుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచారని, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్, పర్యాటకం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలపై తగిన ప్రణాళికలపై దృష్టి సారించిందని చెప్పారు.
సహజంగా ఉగ్రవాదుల ఆచూకీ కోసం బలగాలు వెళ్లినప్పుడు వీధి జాగిలాల సమస్య ఉంటుంది. ఇవి మొరిగితే ఉగ్రవాదులు అప్రమత్తమవుతుంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా లక్ష్యం దిశగా వెళ్తున్నంత సేపూ బృందాలు తగినన్ని బిస్కట్లు అందుబాటులో ఉంచుకున్నాయి.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘట్‌శిలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, బంగ్లాదేశీయుల వలసలతో రాష్ట్రంలో ఆదివాసీల జనాభా గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో హేమంత్ సోనెర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు.
వందే భారత్ రైలులో ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తుండగా ఉదయం 7.12 గంటలకు రైలు బులంద్‌షహర్ జిల్లాలోని కమల్పూర్ స్టేషన్‌ను దాటగానే, బయటి నుండి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు విసిరారని, దీంతో తన ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికుడి పక్కన కిటికీ అద్దాలు పగిలిపోయాయని..
లోయలో గత కొద్ది రోజులుగా దాడులు, ఎన్కౌంటర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయనీ, ఈరోజు శ్రీనగర్‌లో సండే మార్కెంట్లో అమాయక దుకాణదారులపై గ్రనేడ్ దాడి జరగడం దురదృష్టకమని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలను టార్గెట్ చేయడాన్ని ఏమాత్రం సమర్ధనీయం కాదదన్నారు.
ప్రజలను విడగొట్టడం, విద్వేష వ్యాప్తి, ప్రజాస్వా్మిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యమని వయనాడ్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ అన్నారు.