Share News

Amit Shah: అధికారమిస్తే చొరబాట్లకు చెల్లు చీటీ, యూసీసీ అమలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 05:35 PM

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘట్‌శిలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, బంగ్లాదేశీయుల వలసలతో రాష్ట్రంలో ఆదివాసీల జనాభా గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో హేమంత్ సోనెర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు.

Amit Shah: అధికారమిస్తే చొరబాట్లకు చెల్లు చీటీ, యూసీసీ అమలు

రాంచీ: జార్ఖాండ్‌ (Jharkhand) నిరంతరం చొరబాట్ల ముప్పును ఎదుర్కొంటోందని, బంగ్లాదేశ్‌ నుంచి చొరబాటుదారులు రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల రాష్ట్రంలోని ఆదివాసీలకు పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే చొరబాటుదార్లను తరమివేస్తామని భరోసా ఇచ్చారు. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘట్‌శిలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, బంగ్లాదేశీయుల వలసలతో రాష్ట్రంలో ఆదివాసీల జనాభా గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో హేమంత్ సోనెర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు.

Priyanka Gandi: ఏం చేసైనా అధికారంలోకి రావడమే మోదీ లక్ష్యం


''బంగ్లా చొరబాట్లతో జార్ఖాండ్‌లో ఆదివాసీల సంఖ్య తగ్గిపోయింది. చొరబాట్లను హేమంత్ సర్కార్ ఆపగలదా? ఆపలేమంటూ ఆయన ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. దీనిని వ్యతిరేకించిన చంపయి సోరెన్ ఆ పార్టీని (జేఎంఎం) విడనాడారు. అదే మీరు బీజేపీని ఎన్నుకుంటే జార్ఖాండ్ నుంచి చొరబాటుదారులను వెనక్కి పంపించేస్తాం'' అని అమిత్‌షా చెప్పారు.


భూములను అన్యాక్రాంతం కానీయం

గిరిజన సంక్షేమానికి కట్టుదిట్టమైన చట్టాలు చేస్తామని అమిత్‌షా సభాముఖంగా హామీ ఇచ్చారు. గిరిజనుల భూములను చొరబాటుదారుల పేర్లతో రిజిస్టర్ కావడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఆ దిశగా చట్టం తెస్తామని చెప్పారు. చొరబాటుదారులు మన ఆడకూతుళ్లను పెళ్లాడి అందుకు ప్రతిగా వారి భూములను సొంతం చేసుకుంటున్నారని చెప్పారు. తాము తెచ్చే చట్టం వల్ల చొరబాటుదారులకు అలాంటి వెసులుబాటు ఏదీ ఉండదన్నారు. అప్పటికే సొంతం చేసుకున్న భూములను కూడా తిరిగిచ్చేయాల్సి ఉంటుందని చెప్పారు.


ఉమ్మడి పౌరస్మృతి తెస్తాం కానీ..

జార్ఖాండ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేస్తామని కూడా అమిత్‌షా హామీ ఇచ్చారు. యూసీసీతో గిరిజన సంస్కృతికి తెరపడుతుందంటూ వాళ్లు (జేఎంఎం-కాంగ్రెస్) తప్పుడు ప్రచారం సాగిస్తు్న్నారని అన్నారు. యూసీసీని జార్ఖాండ్‌లో తాము అమలు చేస్తామని, అయితే ఆపరిధిలోకి గిరిజనులకు తీసుకురామని అమిత్‌షా భరోసా ఇచ్చారు. గిరిజనులు, వారి చట్టాలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తు్ందని వాగ్దానం చేశారు.


ఇవి కూడా చదవండి:

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన

Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పీంఛన్ పెంపు చేస్తాం

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 03 , 2024 | 05:44 PM