Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సలహాలకు ఎంత తీసుకుంటారో తెలుసా..
ABN , Publish Date - Nov 02 , 2024 | 01:10 PM
రాజకీయ వ్యూహకర్త, జాన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా తన ఫీజుల గురించి వెల్లడించారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా నేతలకు సలహాలు ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుంటానో వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
బీహార్(bihar)లో మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రధాన పార్టీలకు పోటీగా ఓ కొత్త పార్టీ వచ్చింది. అదే జన్ సురాజ్ పార్టీ. ఈ పార్టీ కన్వీనర్ ఇటివల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి ఎన్నికల సలహా ఇస్తే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తానని జాన్ సూరజ్ పార్టీ కన్వీనర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) అన్నారు. బీహార్‌లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ సమాచారాన్ని వెల్లడించారు. బెలగంజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తన ప్రచారాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని పలువురు తరచుగా అడుగుతారని పేర్కొన్న క్రమంలో వెల్లడించారు.
ఒక సలహా రెండేళ్లు ఖర్చు..
పది రాష్ట్రాల ప్రభుత్వాలు తన వ్యూహాలను అనుసరిస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. తన ప్రచారానికి టెంట్లు, గొడుగులు వేయడానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండవని అనుకుంటున్నారా అని కిషోర్ ప్రశ్నించారు. బీహార్‌లోనే కాదు తన ఫీజుల గురించి ఇంతవరకు ఎవరూ వినలేదని వెల్లడించారు. ఈ ప్రకటన పలువురి దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ఎన్నికల్లో సలహాలు ఇస్తే తన ఫీజు రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువేనని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఈ రుసుముతో రాబోయే రెండేళ్లపాటు తన ప్రచార ఖర్చులను భరించవచ్చని ఆయన అన్నారు.
నవంబర్ 13న బీహార్‌లో ఉప ఎన్నికలు..
బీహార్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు జాన్ సూరజ్ తన అభ్యర్థులను నిలబెట్టింది. బెలగంజ్ నుంచి మహ్మద్ అమ్జాద్, ఇమామ్‌గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్‌గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచి కిరణ్‌సింగ్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఫీజుల ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా ఎన్నికల కోసమేనా..
అయితే ఇది తెలిసిన పలువురు ఇన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని చెబితే ఐటీ రైడ్స్ ఏమి ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కేవలం సలహాలకే వందల కోట్ల రూపాయలు తీసుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం కావాలనే ఇలాంటి ప్రకటనలు చేశారని, ఇది కూడా ఎన్నికల స్టంట్ అని అంటున్నారు. ఈ ప్రకటన విషయంలో ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read More National News and Latest Telugu News