Home » NCP
ముంబై: ఎన్సీపీ (NCP) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి (Baba Siddique) హత్య పక్కా ప్లానింగ్తోనే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాంట్రాక్ట్ హత్య కావచ్చునా, వ్యాపారంలో శత్రుత్వమే కారణమా, స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కారణంగానే ఆయనను హంతకులు మట్టుబెట్టారా అనే పలు కోణాల నుంచి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ముంబైలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ నిన్న రాత్రి హత్యకు గురయ్యారు. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది.
చాలాకాలంగా తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఆ కారణంగానే ఈ సిస్టమ్ (రాజకీయాలు)లోకి వచ్చానని షాయాజీ షిండే చెప్పారు. తన సామాజిక సేవ కొనసాగుతుందని తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుండటంతో విపక్ష 'మహా వికాస్ అఘాడి' కూటమి సీట్ల పంపకాలపై కీలక అడుగు పడింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అధికార 'మహాయుతి కూటమి' నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. తాజాగా మహా కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ-ఎపీ చీఫ్ అజిత్ పవార్ తమ వాటా సీట్లలో 10 శాతం టిక్కెట్లు మైనారిటీలకు కేటాయిస్తామని ప్రకటిస్తారు.
మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికారం చేపట్టేందుకు అధికార, విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరితోపాటు రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఆ క్రమంలో విపక్ష మహావికాస్ అఘాడి కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యేలా ఉన్నాయి.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పశ్చాత్తాపపడుతున్నారా? ఎన్నికల్లో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్సభ ఎన్నికల్లో తాను పెద్ద తప్పు చేశానని అన్నారు.
సైబర్ కేసులు ఇటీవల కాలంలో పెరిగి పోతున్నాయి. నేరగాళ్ల బారిన ప్రముఖ వ్యక్తులు పడుతున్నారు. నంబర్ తీసుకొని, బెదిరిస్తున్నారు. భయపడ్డారో ఇక అంతే సంగతులు. ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమె వాట్సాప్ నంబర్ హ్యాకయ్యింది. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 400 డాలర్లు పంపించాలని కోరారట. మన కరెన్సీలో రూ.32 వేలు పంపించాలని అడిగారట. అకౌంట్ నంబర్ కూడా పంపించారని సుప్రియా సూలే వివరించారు.
ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడదామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.