Home » NCP
మహారాష్ట్ర రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్(Sharad Pawar) తన బంధువు, ఎన్సీపీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar)తో రహస్యంగా భేటీ అయినట్టు, కేంద్ర మంత్రివర్గం(Union Cabinet) లో చేరేలా అజిత్ ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు వచ్చిన వార్తలతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమికి భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా? బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీల జాబితా నుంచి ఎన్‌సీపీ జారిపోబోతోందా?
భారతీయ జనతా పార్టీతో పొత్తు ) విషయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పష్టత ఇచ్చారు. కొంతమంది శ్రేయాభిలాషులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేస్తు్న్నారని, అయితే బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేది లేదని తెలిపారు.
మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ కు వైద్య కారణాల రీత్యా రెండు నెలల పాటు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసు కింద 2022 ఫిబ్రవరిలో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరో చీలిక దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోసారి తిరుగుబాటు తప్పకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ఎన్‌సీపీ నేత జయంత్ పాటిల్ ఎన్‌సీపీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు.
‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ (Lokmanya Bal Gangadhar Tilak) ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు.
తమ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్రలో మార్పు తీసుకురాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తాము నిమగ్నవడం కష్టమని తెలిపారు. కాకపోతే కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.
బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ రెండో రోజు పాల్గొననున్నారు. కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు.