Home » Nifty
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(జూన్ 28న) కూడా ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే పటిష్టత కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 214 పాయింట్ల లాభంతో 79,457 వద్ద ప్రారంభమై 79,546 గరిష్ట స్థాయికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ (stock market) సూచీలు గురువారం(జూన్ 27న) కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటి గంటలోనే మార్కెట్ అద్భుతమైన రికవరీని కనబరిచింది సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) సూచీలు వారంలో మొదటిరోజైన సోమవారం(జూన్ 24న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు సహా బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్‌లు కూడా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల ప్రభావంతో దిగువనకు పయనించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మళ్లీ ఐపీఓల(Upcoming IPOs) వారం వచ్చేసింది. ఈసారి జూన్ 24 నుంచి ప్రారంభమయ్యే ట్రేడింగ్ వారంలో ప్రైమరీ మార్కెట్లో చాలా కార్యకలాపాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి 10 కొత్త IPOలు రాబోతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) నేడు (జూన్ 19న) ప్రారంభ ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మార్కెట్లోని ప్రధాన సూచీలు పెరుగుదలతో ప్రారంభమైనప్పటికీ, మొదటి గంట తర్వాత మార్కెట్ భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ తొలిసారిగా 23,600కు మించి ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) బుధవారం (జూన్ 12) స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో మొదటి గంటలోనే మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 23,419 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లు(Stock Markets) లాభాలతో ప్రారంభమయ్యాయి. మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ గూడ్స్, తయారీ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదవ రోజైన గురువారం కూడా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మే 30న (గురువారం) బీఎస్ఈ సెన్సెక్స్ 0.83 శాతం లేదా 617.60 మేర నష్టపోయి 73,885.60 పాయింట్ల ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచీ 216 పాయింట్లు లేదా 0.95 శాతం మేర క్షీణించి 22,500 మార్క్ దిగువన 22,489 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీలు(nifty) గ్రీన్‌లో కనిపించాయి. కానీ ఆ తర్వాత నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ఉదయం 10.20 గంటల ప్రాంతంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 550 పాయింట్లు కోల్పోయింది.
భారత స్టాక్ మార్కెట్(Stock market)లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 9న) సూచీలు మొత్తం గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి. దీంతో BSE సెన్సెక్స్(Sensex) తొలిసారిగా 75,000 మార్క్‌ను దాటేసింది. మరోవైపు నిఫ్టీ(Nifty) కూడా 22,700 స్థాయిని బద్దలు కొట్టి సరికొత్త గరిష్టానికి చేరుకుంది.