Stock Markets: 557 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. నిమిషాల్లోనే లక్షల కోట్ల సంపద.. | Sensex jump 500 points Rs. 2.8 lakh crore of wealth increased by investors bse june 12th 2024 sri
Share News

Stock Markets: 557 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. నిమిషాల్లోనే లక్షల కోట్ల సంపద..

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:02 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) బుధవారం (జూన్ 12) స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో మొదటి గంటలోనే మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 23,419 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది.

Stock Markets: 557 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. నిమిషాల్లోనే లక్షల కోట్ల సంపద..
Sensex jump 500 points Rs. 2.8 lakh crore

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) బుధవారం (జూన్ 12) స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో మొదటి గంటలోనే మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 23,419 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 50(Nifty) తాజా జీవితకాల గరిష్ట స్థాయిని స్కేల్ చేయడంతో దేశీయ స్టాక్‌లు మంచి పెరుగుదలను చూశాయి. దీంతోపాటు ఉదయం 11 గంటల సమయంలో బ్యాంక్ నిఫ్టీ 478 పాయింట్లు పెరుగగా, సెన్సెక్స్ 557 పాయింట్లు ఎగబాకింది. దీంతోపాటు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ కూడా 504 పాయింట్లు లాభపడింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

బ్యాంకులు, ఫైనాన్షియల్‌, ఐటీ, మెటల్‌ షేర్లు లాభపడటం ఈ భారీ పెరుగుదలకు సపోర్ట్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్(Sensex) 500 పాయింట్లకు పైగా ఎగబాకి 76,968 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో దేశీయ మార్కెట్ల పెరుగుదలతో దాదాపు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మదుపర్లు రూ. 2.8 లక్షల కోట్లను సంపాదించారు. ఈ క్రమంలో బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.429.83 లక్షల కోట్లకు చేరుకుంది.


ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌(Sensex)లో టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌ టాప్‌ గెయినర్లుగా ఉండగా, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీల స్టాక్స్ టాప్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో, BPCL, Wipro, LTIMindtree టాప్ 5 జాబితాలో కొనసాగుతుండగా, NTPC, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టైటాన్ నష్టాలకు దారితీశాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం పెరిగింది.


ఇది కూడా చదవండి:

First Lok Sabha Session: 18వ లోక్‌సభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం..ఎప్పటి వరకంటే


Terrorists Attack: కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి..ఆర్మీ బేస్‌పై కాల్పులు, ఒకరు మృతి

For Latest News and Business News click here

Updated Date - Jun 12 , 2024 | 11:05 AM