Stock Market: తొలిసారి 79 వేల మార్క్‌ను అధిగమించిన సెన్సెక్స్.. సరికొత్త గరిష్టానికి నిఫ్టీ..
ABN , Publish Date - Jun 27 , 2024 | 11:05 AM
దేశీయ స్టాక్ మార్కెట్ (stock market) సూచీలు గురువారం(జూన్ 27న) కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటి గంటలోనే మార్కెట్ అద్భుతమైన రికవరీని కనబరిచింది సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ (stock market) సూచీలు గురువారం(జూన్ 27న) కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటి గంటలోనే మార్కెట్ అద్భుతమైన రికవరీని కనబరిచింది సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి 79,000 మార్కును దాటగా, నిఫ్టీ కూడా తొలిసారిగా 24 వేలను అధిగమించింది.
ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా 53,000 పాయింట్లను దాటడం విశేషం. కానీ ట్రేడింగ్ సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత ఇండెక్స్‌లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 11 గంటల నాటికి 63 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో ఉంది.
ఈ క్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, JSW స్టీల్, HUL కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, లార్సెన్, టెక్ మహీంద్రా సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.41 శాతం, స్మాల్‌క్యాప్ 0.26 శాతం లాభపడింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 0.50 శాతం పతనంతో టాప్ లూజర్‌గా నిలిచింది. మరోవైపు మీడియా, మెటల్ 0.85 శాతం, 0.59 శాతం చొప్పున పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.
నిన్నటి ట్రేడింగ్ గురించి చూస్తే మార్కెట్‌లో బూమ్ కనిపించింది. జూన్ 26న, సెన్సెక్స్(sensex) 0.90 శాతం పెరిగి 78,759.40 వద్ద సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో నిఫ్టీ(nifty) 50 0.71 శాతం పెరిగి 23,889.90 వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. ఇక నేడు GIFT నిఫ్టీ ఫ్యూచర్స్ 72 పాయింట్లు తగ్గి 23,796 వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్‌లో క్షీణత కనిపించింది. ఎందుకంటే యెన్‌లో బలహీనత కనిపించింది. మరోవైపు జపాన్‌కు చెందిన నిక్కీ, కొరియాకు చెందిన కోస్పి 0.94 శాతం చొప్పున క్షీణించగా, ఆస్ట్రేలియా ASX200 1.50 శాతం పడిపోయింది.
ఇది కూడా చదవండి:
T20 World Cup 2024: నేడు ఇండియా, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్.. గెలుపెవరిది?
Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం
For Latest News and Business News click here