Stock Market Updates: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ నష్టాల స్టాక్స్..!
ABN , Publish Date - Jun 24 , 2024 | 10:02 AM
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) సూచీలు వారంలో మొదటిరోజైన సోమవారం(జూన్ 24న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు సహా బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్‌లు కూడా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల ప్రభావంతో దిగువనకు పయనించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) సూచీలు వారంలో మొదటిరోజైన సోమవారం(జూన్ 24న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు సహా బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్‌లు కూడా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల ప్రభావంతో దిగువనకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9.40 నిమిషాల సమయంలో సెన్సెక్స్(sensex) దాదాపు 400 పాయింట్లు పతనమై 76,885 వద్ద, నిఫ్టీ(nifty) కూడా 103 పాయింట్లు తగ్గి 23,382 వద్ద ప్రారంభమయ్యాయి. మరోవైపు నిఫ్టీ బ్యాంక్(nifty bank) 473, నిఫ్టీ మిడ్ క్యాప్ 100(nifty midcap) సూచీ 530 పాయింట్లు కోల్పోయింది.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, మెటల్ షేర్లు ప్రధానంగా క్షీణించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా అర శాతం మేర నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, సిప్లా, అదానీ పోర్ట్స్, SBI బ్యాంక్ కంపెనీల షేర్లు టాప్ 5 నష్టాల్లో ఉండగా, సన్ ఫార్మా, ITC, TCS, విప్రో, ICICI బ్యాంక్ సంస్థలు షేర్లు టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్ లో జూన్ 21న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) రూ.1,790.19 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) రూ.1,237.21 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఇతర మార్కెట్లు..
ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో సెంటిమెంట్ వైవిధ్యంగా ఉంది. కొరియా కోస్పి 0.20 శాతం, ఆస్ట్రేలియా ASX 0.28 శాతం పడిపోయింది. జపాన్ నిక్కీ 0.40 శాతం లాభంతో బలాన్ని కనబరిచింది. ఈ వారంలో ఆస్ట్రేలియా, జపాన్‌ల నుంచి ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడవచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. USలో మునుపటి సెషన్ మిశ్రమ ఫలితాలతో ముగిసింది. S&P500 0.16 శాతం, నాస్‌డాక్ 0.18 శాతం జారిపోగా, డౌ జోన్స్ 0.04 శాతం పెరిగింది. నేడు దేశంలో పార్లమెంట్ వర్షాకాల ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండటం విశేషం.
ఇది కూడా చదవండి:
Onion Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు, కారణమిదే
Next IPOs: ఐపీఓల వారం మళ్లీ వచ్చేసింది.. ఏకంగా 10..
For Latest News and Business News click here