Share News

Stock Market Updates: 560 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్ క్యాప్

ABN , Publish Date - May 06 , 2024 | 10:32 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌(Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు(nifty) గ్రీన్‌లో కనిపించాయి. కానీ ఆ తర్వాత నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ఉదయం 10.20 గంటల ప్రాంతంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 550 పాయింట్లు కోల్పోయింది.

Stock Market Updates: 560 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్ క్యాప్
Nifty Midcap lost 560 points may 6th 2024

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌(Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు(nifty) గ్రీన్‌లో కనిపించాయి. కానీ ఆ తర్వాత నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ఉదయం 10.20 గంటల ప్రాంతంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 550 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 22,4600 పరిధిలో ట్రేడైంది. మరోవైపు సెన్సెక్స్ కూడా 229 పాయింట్లు పెరిగి 74,122 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 166 పాయింట్లు పెరిగి 49,090 పరిధిలో ట్రేడవుతుంది.


ఈ క్రమంలో ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా, TCS, M&M, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, టైటాన్ కంపెనీ, కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైస్, అదానీ పోర్ట్స్, ONGC సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల ధోరణులు సహా పలు అంశాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నట్లు తెలుస్తోంది.


ఐడీబీఐ(IDBI) బ్యాంక్ నాలుగో త్రైమాసిక లాభం వార్షిక ప్రాతిపదికన 43.7 శాతం పెరిగి రూ.1,628.5 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.1,133.4 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ వడ్డీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పెరిగి రూ.3,687.9 కోట్లకు చేరింది. అదే సమయంలో 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.3,279.6 కోట్లుగా ఉంది.


ఇది కూడా చదవండి:

IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా


Read Latest Business News and Telugu News

Updated Date - May 06 , 2024 | 10:37 AM