Home » Nitish Kumar
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏ క్షణంలోనైనా తిరిగి ఎన్డీఏలోకి వస్తారంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ తోసిపుచ్చారు. ఆయన రావాలనుకున్నా బీజేపీ అందుకు సిద్ధంగా లేదని చెప్పారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా? అవుననే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఎన్డీయేలోకి నితీష్ రానున్నారంటూ కేంద్రం మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలను తాజాగా జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ బలపరిచారు.
విపక్షాల కూటమి ఇండియా ఏర్పాటుకు మొదట్నించీ విస్తృతంగా కసరత్తు చేస్తూ, ఇటీవల పాట్నాలో కూటమి సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ ఏ క్షణంలోనైనా ఎన్డీయేలో చేరుతారని, నితీష్ తమ వాడని అన్నారు.
కులాలవారీ జనాభా లెక్కలను సేకరించాలని కొందరు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు ఓ విషయాన్ని చెప్పింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు మినహా మిగిలిన కులాల జనాభాను కులాలవారీగా సేకరించలేదని తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు ఏర్పాటు జాతీయ అభివృద్ధి సమ్మళిత కూటమి (ఇండియా) పేరు విషయంలో నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారంటూ వచ్చిన ఊహాగానాలను జేడీయూ నేతలు కొట్టిపారేశారు. విపక్ష నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగించిన వారిలో నితీష్ ఒకరని, ఆయనకు ఎలాంటి ఆగ్రహం లేదని తెలిపారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన 26 పార్టీల కూటమిపై ఏఐఎంఐఎం (AIMIM) ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ సారూప్యతగల ఈ పార్టీలకు తాము రాజకీయంగా అంటరానివారమయ్యామా? అని నిలదీసింది.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమైన ప్రతిపక్షాలు తమ కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A) అని నామకరణం చేశాయి. అయితే ఈ పేరు పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)కు వ్యతిరేకంగా బెంగళూరు నగరంలో పోస్టర్లు వెలిశాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee)తో స్నేహం చేసినప్పటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) చాలా మారిపోయారని బీజేపీ ఆరోపించింది.
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతను సోనియా గాంధీ స్వీకరించారు. ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి ఆమె హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.