Home » Nominations
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.
రాయబరేలి నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం ఖరారు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. అమేథీలో పోటీకి బయపడే ఆయన రాయబరేలి వైపు పరిగెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన వెంట సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రా హాజరయ్యారు.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ( AP Elections 2024)ల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల స్వీకరణ గడువు ఏప్రిల్ 25వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
ఎవరీ పద్మావతి.. ఇప్పుడీ ఈ పేరు ఒక్క గుడివాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె.. ఎందుకింతలా హైలైట్ అవుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘ ట్టం గురువారంతో ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశా రు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి 21 మంది అభ్యర్థులు 34 నా మినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అభిషేక్ కుమార్ తెలిపారు.
Andhrapradesh: ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. రేపు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.
Andhrapradesh: ఒకేసారి టీడీపీ, వైసీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఆర్డోవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీడీపీ శ్రేణులపై రాళ్లు విసురుతూ అధికారపార్టీ శ్రేణులు రణరంగం సృష్టించారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి కాస్త సర్దుమణిగింది. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. తిరుపతిలోనే.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతలు, అభ్యర్థుల మధ్య ఇలాంటి మామూలే అనుకుంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నామినేషన్‌కు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు..