Home » NRI Latest News
డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా సమితి (దుబాయి, యూఏఈ) వారి ఆధ్వర్యంలో గల్ఫ్ బోర్డు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవవంత్ రెడ్డికి టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు తెలిపింది.
సింగపూర్‌లో బహిరంగ మలవిసర్జన చేసిన ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం మత్తులో తానిలా చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి తాజాగా రూ.25 వేల జరిమానా విధించింది.
సౌదీ అరేబియాలోని దమ్మాంలోగల భారతీయ అంతర్జాతీయ పాఠశాలలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికార వర్గాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గ్లోబల్ ఇండియన్ (జియో) అధ్యక్షుడు మల్లేశన్ తెలిపారు.
కర్నాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో వ్యవస్థాపకురాలు జస్సోత బాలసుబ్రహ్మణ్యం శంకర నేత్రాలయ యూఎస్ఏ (SNUSA) ప్రెసిడెంట్ బాలా రెడ్డి ఇందుర్తి, ట్రస్టీ నీలిమ గడ్డమణుగులను సంప్రదించి, అట్లాంటాలోని 8 విభిన్న శాస్త్రీయ నృత్య అకాడమీలతో సమన్వయం చేసుకుని, పేదల వైద్యం కోసం నిధుల సేకరణ కోసం నవరసం పేరిట నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14, 2024న ఫిలడెల్ఫియాలో లేడీస్ నైట్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలుగు సమాజంలో ప్రప్రథమంగా నవరాత్రుల ఆధ్యాత్మికతతో గణనాథుడు అరేబియా సముద్రం ఒడిలోకి చేరుకొన్నాడు.
గల్ఫ్ దేశాలలో మృతి చెందిన ప్రవాసీయుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అయిదు లక్షల రూపాయాల ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల ఏపీలో సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన ఏపీ సీఎం సహాయ నిధికి ఉత్తర అమెరికా ఎన్నారై టీడీపీ శ్రేణులు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశాయి.
ఎడారి దేశం సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా తెలుగు భాషా దినోత్సవం పేరిట ‘సాటా’ నిర్వహించే తెలుగు ప్రవాసీ ఆత్మీయ సమ్మేళనానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను తానా ఫౌండేషన్ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ ముమ్మరంగా చేస్తున్నారు.