NRI: సౌదీలో తెలుగు ఆత్మీయ సమ్మేళనం కోసం జోరందుకున్న ఏర్పాట్లు!
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:33 PM
ఎడారి దేశం సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా తెలుగు భాషా దినోత్సవం పేరిట ‘సాటా’ నిర్వహించే తెలుగు ప్రవాసీ ఆత్మీయ సమ్మేళనానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.
ఎన్నారై డెస్క్: ఎడారి దేశం సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా తెలుగు భాషా దినోత్సవం పేరిట సాటా (SATA) నిర్వహించే తెలుగు ప్రవాసీ ఆత్మీయ సమ్మేళనానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.
శుక్రవారం జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాజధాని రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీ (NRI) కుటుంబాలతో పాటు దేశవ్యాప్తంగా సుదూర ఎడారి ప్రాంతాల నుండి అనేక మంది హాజరుకానున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.
తెలుగు పలుకుల కోసం తపించే ఎడారి నాట నిండు తెలుగుతనంతో కూడిన అచ్చు గోదావరి సంప్రదాయంలో అరబ్బునాట అందరు తన వారేనా అనే తన్మయత్వంలో జరిగే ఈ సమ్మేళనంలో పాల్గొనడానికి నూతనంగా వచ్చే కుటుంబాలు ఆసక్తి ప్రదర్శిస్తుంటాయి.
NRI: యూఏఈ అమ్నెస్టీ గురించి తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవాలి: ఐపీయఫ్
1400 కిలోమీటర్ల దూరంలోని తబూక్ దుబా నుండి తుని పట్టణానికి చెందిన హరిప్రియ 1200 కిలోమీటర్ల దూరంలోని తురేఫ్ నుండి శ్రీకాకుళానికి చెందిన పావిడి నరేశ్.. అదే విధంగా 1000 కిలో మీటర్ల జెద్ధా నుండి హైదరాబాద్‌కు చెందిన అరుణ ఈ రకంగా అనేక మంది దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రాజధాని రియాధ్‌కు బయలుదేరడానికి సంసిద్ధులవుతున్నారు.
ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు రానున్నట్లుగా సాటా ప్రతినిధులు పేర్కొన్నారు. వందలాది కుటుంబాలకు మూడు పూటలా భోజనం, అల్పాహారం వగైరాలు అందిస్తామని కూడా వెల్లడించారు. పిల్లలకు, మహిళలకు ఆద్యంతం వినోద భరిత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని సాటా నిర్వహకులు ఆనందరాజు, ముజ్జమ్మీల్, రంజీత్, మల్లేశన్ తెలిపారు.
Dubai: దుబాయి తెలుగు సంఘంపై దుష్ప్రచారం జరుగుతోంది: సంస్థ ప్రతినిధులు
కార్యక్రమానికి భారతీయ ఎంబసీ అధికారులతో పాటు నగరంలోని భారతీయ ప్రముఖులు కూడా హాజరవుతారని వారు వెల్లడించారు. కష్టకాలంలో సుదూర ఎడారులలో ఒంటెల మధ్య చిక్కుకొన్నా సురక్షితంగా కాపాడిన ప్రవాసీ సామాజిక కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా సన్మానించనున్నట్లుగా చెప్పారు. మరిన్ని వివరాలకు 0556473503 లేదా 0581541366 లేదా 0559636179 లపై సంప్రదించవచ్చని సూచించారు.
NRI: ప్రవాసీ బీమా పథకాన్ని సహజ మరణాలకు వర్తించాలి: ఎన్నారై బీజేపీ నాయకుల డిమాండ్