Home » ODI World Cup
ఎంతో ఆసక్తి రేపిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమి పాలవ్వడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టుకున్న సన్నివేశాలు లైవ్‌లో కనిపించాయి. దీంతో ఈ వీడియో చూసి అతడి అభిమానులు ఫీలవుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో పిచ్‌కు తగ్గట్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి శుభారంభాలు అందించినా రోహిత్‌కు కన్నీరే మిగలడం నిజంగా బాధాకరంగా ఉందని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ODI World Cup 2023: టీమిండియా అభిమానులు ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. దీంతో మూడోసారి వన్డే ప్రపంచకప్ విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా తుది పోరులో దారుణ ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియా ఆరోసారి విజేతగా నిలిచి 2003 తరహాలో టీమిండియా ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోరుకే తట్టాబుట్టా సర్దేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి..
సినిమాల తరహాలోనే క్రీడల్లోనూ ఎన్నో సెంటిమెంట్లను అనుసరిస్తుంటారు. మైదానంలోకి దిగినప్పటి నుంచి గెలుపుదాకా.. ఎన్నో సెంటిమెంట్లను ఆపాదిస్తుంటారు. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ ఖప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అలాంటి లెక్కలు వేసుకుంటున్నారు.
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది.
IND vs AUS Final: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 550కిపైగా పరుగులు చేశాడు. దీంతో 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.
World Cup Final: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ముగింపు వేడుకల్లో భారత వైమానిక దళం చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ప్రదర్శన ఇచ్చాయి. మొత్తం 9 ఎయిర్‌క్రాఫ్ట్‌లు చేసిన విన్యాసాలు అలరించాయి.
IND vs AUS Final: ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
IND vs AUS Final: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. తుది పోరులో ట్రోఫి కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ పోరు కోసం భారత క్రికెటర్లు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆటగాళ్లు స్టేడియంలోకి అడుగుపెట్టారు. భారత ఆటగాళ్లు వెళ్తున్న కాన్వాయ్‌కు అభిమానులు అడుగడునా బ్రహ్మరథం పట్టారు.
ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది.