Home » Olympic Sports
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది.
పారిస్ ఒలింపిక్స్‌లో ఆటలతో పాటు మరో ‘చిత్రం’ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విశ్వక్రీడల ప్రారంభోత్సవంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మాక్రాన్, ఆ దేశపు క్రీడల మంత్రి అమేలీ ఔడియా కాస్టెరాల ముద్దు ఫొటో ఫ్రాన్స్‌లోనే కాదు...ప్రపంచమంతా ‘హాట్’ టాపిక్ అయింది.
పారిస్ ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యువీ సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. దీంతో పతకానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్సెన్ సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో రాణించిన ఆక్సెల్సెన్ ఫైనల్స్‌లో థాయిలాండ్ ఆటగాడు కున్లావుట్ విటిద్‌సర్న్‌పై 21-11, 21-11 తేడాతో వరుస రెండు సెట్లలో విజయం సాధించి బంగారు పతకం సాధించాడు.
ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చివరికి పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్ చేతిలో ఓటమితో ఫైనల్స్ ఆశలు చేజార్చుకున్న లక్ష్యసేన్.. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందాడు.
ఒలింపిక్స్ లాంటి మెగా పోటీల్లో గెలుపు... ఓటముల మధ్య తేడా సన్నని రేఖ మాత్రమే. అక్కడ ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువా కాదు. నైపుణ్యంలో దాదాపు అందరూ సమానమే. కానీ బరిలో నిలిచి... అంచనాలను అందుకొనేది... ఒత్తిడిలో చిత్తవకుండా మానసికంగా దృఢంగా ఉన్నవారే.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్ చేతిలో ఓడిపోయాడు.