Share News

Lakshya Sen: కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..

ABN , Publish Date - Aug 05 , 2024 | 07:46 PM

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు.

Lakshya Sen: కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..
Lakshya Sen

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు. సెమీస్ చేరడంతోనే అసలు ఎవరీ లక్ష్యసేన్ అనే చర్చ మొదలైంది. వాస్తవానికి బ్యాడ్మింటన్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎక్కువుగా తెలిసిన పేర్లు పుల్లెల గోపిచంద్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్ సాయిరాజ్.. వీరంతా తెలుగువాళ్లు కావడంతో ఇక్కడ ప్రజలకు సుపరిచితులు. కానీ ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటున్న పేరు లక్ష్యసేన్. పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని తుదిలో చేజార్చుకున్నప్పటికీ తన ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు లక్ష్యసేన్. కాంస్య పతక పోరులో మలేషియాకు చెందిన లీ జీ జియాపై లక్ష్యసేన్ ఓటమి చవిచూశాడు. ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న లక్ష్యసేన్ 2001 ఆగష్టు 16న ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.


లక్ష్యసేన్ తన చిన్నతనం నుంచే బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టాడు. సేన్ తాతయ్య చంద్రలాల్ సేన్ అల్మోరాలో బ్యాడ్మింటన్ ఆటను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి. లక్ష్యసేన్ మొదటి కోచ్ అతడి తండ్రి డికె సేన్. 2021 ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో కాంస్యపతకాన్ని, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు, 2022 ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరడం ద్వారా వార్తల్లో నిలిచాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డెన్మార్క్‌కు చెందిన విక్టర్ ఆక్సెల్సెన్‌‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆట తర్వాత వచ్చే ఒలింపిక్స్‌లో లక్ష్యసేన్ స్వర్ణం సాధిస్తాడంటూ చెప్పడమే లక్ష్యసేన్ ఆటతీరుకు నిదర్శనం.

Olympics 2024: శభాష్‌.. శ్రీజేష్‌


కుటుంబ వారసత్వంగా..

లక్ష్యసేన్‌ కుటుంబ వారసత్వంగా బ్యాడ్మింటన్ క్రీడలో ప్రవేశించాడు. సేన్ తాతయ్య, తండ్రి, అతడి సోదరుడు చిరాగ్ సేన్ కూడా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. చిన్నతనం నుంచే బ్యాడ్మింటన్‌పై లక్ష్యసేన్ మక్కువ పెంచుకున్నాడు. 4 సంవత్సరాల వయసులో తన తండ్రితో కలిసి స్టేడియంకు వెళ్లడం ప్రారంభించాడు. తండ్రితో పాటు బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని ఆడటం ప్రారంభించాడు. లక్ష్యసేన్ సామర్థ్యాన్ని చూసి ముగ్ధుడైన కోచ్, భారత బ్యాడ్మింటన్‌లో దిగ్గజం ప్రకాష్ పదుకొణె దగ్గర శిక్షణలో లక్ష్యసేన్ చేర్చాడు. ఓవైపు చదువలో రాణిస్తూనే.. బ్యాడ్మింటన్‌లో రాణించాడు. 15 ఏళ్ల వయసులో లక్ష్యసేన్ జాతీయ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు చేరి అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

జొకో సాధించాడు


విజయాలు..

లక్ష్యసేన్ ఎన్నో జూనియర్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. 2016లో ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2017లో ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్, యురేషియన్ బల్గేరియన్ ఓపెన్‌లను గెలుచుకున్నాడు. 2022లో ధామస్ కప్ సాధించిన జట్టులో భాగస్వాముడిగా ఉన్నాడు. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించి.. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో తన లక్ష్యాన్ని సాధిస్తాడని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది.


Paris Olympics 2024: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం

Gymnastics : బంగారు బైల్స్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 07:47 PM