Home » Parliament
కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) రేపు(జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(MP Vadiraju Ravichandra), పార్టీ విప్‌గా ఎంపీ దివకొండ దామోదర్‌రావు(MP Divakonda Damodar Rao)ను నియమిస్తూ బీఆర్ఎస్ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వారి నియామకాన్ని ఖరారు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR).. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
పార్లమెంటు ప్రాంగణంలోని మహనీయులు విగ్రహాలను వేరే చోటికి తరలించడంపై కాంగ్రెస్ భగ్గుమంది. మహాత్మాగాంధీ, శివాజీ, బీఆర్ అంబేద్కర్ తదితర మనీయుల విగ్రహాలను తిరిగి యథాతథ స్థానాల్లోకి తీసుకురావాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు లేఖ రాశారు.
గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజారిటీ ఉండటంతో లోక్ సభలో ప్రతిపక్షాల బలం నామమాత్రంగానే ఉండింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్(Congress) 2014, 2019 ఎన్నికల్లో చతికిలపడి దిగువసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు దూరమైంది.
2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై మూడో వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు.
పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రం(మోడల్ స్టేట్)గా తీర్చిదిద్దుతానని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ఐదేళ్లుగా కుంటుపడిందని, తక్షణమే దాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఇటీవలి ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీలతో 18వ లోక్‌సభ ఈ నెల 24న కొలువుదీరనుంది. జూలై 3 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి మూడు రోజులు
ఎట్టకేలకు లోక్ సభ(Lok Sabha Elections 2024) ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. రాష్ట్రాల్లో ఎంపీలుగా ఎన్నికైన వారే కేంద్రంలో సర్కార్‌ని ఎన్నుకుంటారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రాగా, ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. అయితే ఎంపీల జీతం(MPs Salaries) ఎంతుంటుందోనని ఎప్పుడైనా ఆలోచించారా.
దేశంలో 18వ లోక్‌సభ తొలి సెషన్(First Lok Sabha session) జూన్ 24 నుంచి ప్రారంభం కానుంది. దీంతోపాటు 264వ రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం సహా తదితర అంశాలపై చర్చించనున్నారు.