Home » PM Modi
ప్రముఖ గుస్సాడీ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మృతి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లోశంకుస్థాపన చేస్తామని తెలిపారు. మూడేళ్లలో రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. తమకు మరింతగా ఉపయోగ పడుతుందని అన్నారు.
కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలను, మెట్రో నగరాలను కలుపుతూ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.
ఉగ్రవాదం అనే సవాలును ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరికి తావు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఏకతాటిపై నిలిచి, పరస్పరం పటిష్ఠ మద్దతుతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో.. పట్టపగలు ఓ వ్యక్తి పోలీసులు, ఫైర్ సిబ్బందిని పరుగులు పెట్టించాడు. హైటెన్షన్ పోల్ ఎక్కి సీజే, ముఖ్యమంత్రి లేదంటే ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు.
వయనాడ్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్‌సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
భారతదేశ ఆకాంక్షలు నిజమయ్యేదాకా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూనే ఉంటుందని, విశ్రాంతికి అవకాశమే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని మోదీ వారసుడు జగన్ తిరిగారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు వైఎస్సార్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటేనని విమర్శించారు.
దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్ల రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.