Home » Polavaram
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడం.. బాబు ఆన్ డ్యూటీ అంటూ రంగంలోకి దిగిపోవడం ఇవన్నీ చకచకానే జరిగిపోతున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సమీక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ కళొచ్చింది. టీడీపీ అఽధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గోదావరిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంచనాలు రెట్టింపయ్యాయి.
గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పనులు రెండు శాతం కూడా పూర్తి చేయలేదని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో చేసిన విధ్వంసం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. మొండిగా రివర్స్ టెండరింగ్ అమలుతో అంతులేని నష్టం జరిగింది.
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
Andhrapradesh: జిల్లాలోని బుట్టాయిగూడెం మండల టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం సమావేశమయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, పోలవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు , టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 72 శాతం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్రెడ్డి విజయవంతంగా గోదావరిలో ముంచేశారు. చంద్రబాబు హయాంలో ఉవ్వెత్తున సాగిన పనులను రివర్స్ టెండరింగ్‌తో బొంద పెట్టేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇంకా గడువు.. రోజుల్లో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తించేస్తున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ సైతం ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సోమవారం రాజమహేంద్రవరంతోపాటు అనకాపల్లి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్‌కు మద్దతుగా ప్రధాని ప్రచారం చేయనున్నారు.