Share News

Eluru : నేడు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:42 AM

ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రా జెక్టును ఆదివారం విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుం ది. ఈ బృంద సభ్యులు ఉదయం 9.45గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు.

 Eluru : నేడు పోలవరానికి  విదేశీ నిపుణుల బృందం

  • ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సమగ్ర పరిశీలన

పోలవరం, జూన్‌ 29: ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును ఆదివారం విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుం ది. ఈ బృంద సభ్యులు ఉదయం 9.45గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు. ప్రాజెక్టు అధికారులతో కలసి ఎగువ కాఫర్‌ డ్యాం, రివర్‌ బెడ్‌లో జెట్‌ గ్రౌటింగ్‌, ఎగువ కాఫర్‌ డ్యాం సెక్షన్‌, డ్యాం నిర్మాణం ఫొటో ఎగ్జిబిషన్‌, ఐసీసీఎస్‌ ద్వారా నిర్ధారించిన కాఫర్‌ డ్యాం సామర్థ్యం, సీపేజీ విషయంలో 2023 సెప్టెంబరులో హెచ్‌పీటీ ప్రొఫెసర్‌ రాజు బృందం నివేదికలను పరిశీలిస్తారు.

అనంతరం 2020-23 వరకు జరిగిన సీపేజీ తీవ్రత తెలిపే ఫిజియో మీటర్‌ రీడింగులు, మట్టి రాతి నాణ్యతా పరిశీలన(సీఎ్‌సఎంఆర్‌) జియోఫిజికల్‌ నివేదికలు, ఏఎ్‌ఫఆర్‌వై ప్రతిపాదించిన జియో టెక్నికల్‌ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద చానల్‌ 1450 నుంచి290 వరకు ఫొటోగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే దిగువ కాఫర్‌ డ్యాంలో రివర్‌ బెడ్‌ జెట్‌ గ్రౌటింగ్‌, దిగువ కాఫర్‌ డ్యాం సెక్షన్‌, క్రాస్‌ సెక్షన్‌ స్కవ ర్‌, దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలన చేస్తారు.

2021-22 మే వరకు దిగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీ వివరాలు పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటల వరకూ ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం గ్యాప్‌ 1, ఇండెక్స్‌ డ్యాం ప్లాన్‌, గ్యాప్‌-1లో సమస్యాత్మక ప్రాంతాన్ని, జియోలాజికల్‌ సెక్షన్‌, ఓవర్‌ ఆల్‌ లేఅవుట్‌ గ్రౌండ్‌ ఇంప్రూవ్‌ మెంట్‌, సీడబ్ల్యూసీ అప్రూవల్స్‌, డయాఫ్రంవాల్‌ తదితర అంశాలను పరిశీలిస్తారు. పీపీఏ నియమించిన విదేశీ నిపుణుల బృందంలో అమెరికాకు చెంది న జియన్‌ఫ్రాంకో డి సిక్కో ముఖ్యుడు. డయాఫ్రంవాల్‌, డ్రిల్‌ షాఫ్ట్‌లు సాయిల్‌ మిక్సింగ్‌ సస్టెయినబిలిటీ మెరైన్‌ ఫౌండేషన్‌ కమిటీలకు డీఎ్‌ఫఐ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.


భూకంప ఇంజనీరింగ్‌లో నిపుణుడు

జియో టెక్నాలజీలో 28 ఏళ్ల అనుభవం కలిగిన కెనడా నిపుణుడు సీన్‌ హించ్‌బెర్గర్‌కు ప్రాజెక్టుల నిర్మాణంలో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఫౌండేషన్‌ ఇంజనీరింగ్‌ టైలింగ్‌ డ్యాం లు, ఎంబాంక్‌మెంట్‌ డ్యాంల నిర్మాణం, మట్టిరాతి నాణ్యత స్ట్రక్చర్‌ ఇంటరాక్షన్‌, భూకంప ఇంజనీరింగ్‌లో నైపుణ్యం ఉంది.

ఇరాక్‌ ప్రభుత్వానికి సాంకేతిక సాయం

డేవిడ్‌ బి పాల్‌... మోసుల్‌ డ్యామ్‌ టాస్క్‌ఫోర్సుకు డ్యామ్‌ సేఫ్టీ ఆఫీసర్‌గా పనిచేశారు. డ్యామ్‌ భద్రతా సమస్యలను తగ్గించడానికి ఇరాక్‌ ప్రభుత్వానికి సాంకేతిక సహాయాన్ని అందించారు. ఆనకట్టల నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పన, లెవీ డిజైన్‌, ఇంజనీరింగ్‌ ప్రమాద అంచనాలు, డ్యాముల లెవీ భద్రతా మార్పులలో జాతీయ నిపుణుడు.

జియోటెక్నికల్‌లో ఎన్నో పరిశోధనలు

కెనడాకు చెందిన రిచర్డ్‌ డొనెల్లీ గతంలో జలశక్తికి స్వతం త్ర ప్రపంచ సలహాదారుగా వ్యవహరించారు. రిచర్డ్‌ జియోటెక్నికల్‌ ఇంజనీరింగ్‌, డ్యామ్‌ సేప్టీ, రిస్క్‌ ఇన్ఫర్మేషన్‌ డెసిషన్‌ మేకింగ్‌ హైడ్రోజియాలజీ, జియాలజీ సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఎన్నో పరిశోధనలు చేశారు.

Updated Date - Jun 30 , 2024 | 04:50 AM