Home » Polavaram
అవును.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నవ్వారు..! అది కూడా మామూలు నవ్వు కాదండోయ్ పగలబడి మరీ నవ్వారు..!
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చాటి చెప్పే విషయం ఒకటి వెలుగుచూసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ముఖ్యమంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. అది కూడా వంద వాట్స్ బల్బులాగా కాంతులీనారు. మేము మోనార్కులమన్నట్లుగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే.. ప్రజాస్యామ్యదేశంలో ప్రజలు తమకు ఈ హోదా కట్టబెట్టారన్నట్లుగా కాకుండా.. తాము దైవాంశ సంభుతులమని.. తమ జాతకంలో గజకేసర యోగం కదంతొక్కుతుందని.. అందుకే తమకు ఈ యోగం.. ఈ మహారాజ యోగం దక్కిందన్నట్లుగా మసులుకున్నారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ‘రివర్స్’ వద్దన్నా జగన్ పట్టించుకోలేదు. చివరికి... ఒక విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం, విధ్వంసాన్ని వివరించి...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ ప్రశ్నార్థకం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు.
తనకు అర్థం కాలేదు కాబట్టి.. పోలవరం సబ్జెక్ట్ ఇంకెవరికీ అర్థం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తొలిసారిగా చెప్పిన గొప్పతనం కూడా తనదేనని గొప్పగా చెప్పుకొన్నారు.