Pongal: ప్రైవేటు బస్సుల్లో ‘పొంగల్’ దోపిడీ..
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:09 PM
పొంగల్ పండుగను అడ్డుపెట్టుకుని ప్రైవేటు బస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేలా ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేస్తున్నాయి. చెన్నై - తిరునెల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ఏకంగా రూ.4 వేలు చార్జీ వసూలు చేయడం గమనార్హం.
- చెన్నై నుంచి నెల్లైకు రూ.4 వేలు
- ఇష్టానుసారంగా ప్రైవేట్ ట్రావెల్స్
చెన్నై: పొంగల్ పండుగను అడ్డుపెట్టుకుని ప్రైవేటు బస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేలా ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేస్తున్నాయి. చెన్నై - తిరునెల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ఏకంగా రూ.4 వేలు చార్జీ వసూలు చేయడం గమనార్హం. దీనిని చూసిన ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా పొంగల్, దీపావళి(Pongal, Diwali) పండుగలకు నగర వాసులు తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు రైళ్ళన్నీ రద్దీతో నడుస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: IMD: వాతావరణశాఖకు 150 ఏళ్లు..
అయితే, ఈ రద్దీ సమయంలో ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేస్తుంటాయి. ఈ యేడాది పొంగల్ పండుగకు సొంతూర్లకు వెళ్ళేవారి కోసం ఈ నెల 10, 11, 12, 13వ తేదీల్లో రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే, ప్రభుత్వ బస్సుల్లో రిజర్వేషన్లు ఫుల్ అవడంతో అనేక మంది ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.
దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అధిక మొత్తంలో చార్జీ వసూలు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన చెన్నై నుంచి మదురైకు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఏసీ సీటింగ్ బస్సుల్లో రూ.3 వేలు, ఏసీ స్లీపర్ క్లాస్ బస్సుల్లో రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. చెన్నై నుంచి నెల్లైకు రూ.4 వేలు, చెన్నై - తూత్తుకుడి(Chennai - Thoothukudi)కి మధ్య ఏసీ సీటింగ్ రూ.3 వేలు, స్లీపర్ రూ.4 వేలు వసూలు చేస్తున్నారు.
తిరుచ్చికి రూ.2,500, తెన్‌కాశితో పాటు పలు ప్రాంతాలకు రూ.3వేలు కోయంబత్తూరు, పొల్లాచ్చి, తిరుపూరు ప్రాంతాలకు అయితే ఏకంగా రూ.5 వేలు వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కేవలం రూ.1000 నుంచి రూ.1500 మాత్రమే వసూలు చేస్తుండగా, ఇపుడు మాత్రం రెట్టింపు చార్జీలను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్
ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు
Read Latest Telangana News and National News