Deputy CM: మార్చిలోగా ‘వారందరికీ’ రూ.1000 ఇస్తాం..
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:31 PM
కలైంజర్ మహిళా సాధికారిక నగదు పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న గృహిణులందరికీ మార్చిలోగా రూ.1000 చెల్లించనున్నట్లు బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) సభ్యుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.
- అసెంబ్లీలో ఉదయనిధి ప్రకటన
చెన్నై: కలైంజర్ మహిళా సాధికారిక నగదు పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న గృహిణులందరికీ మార్చిలోగా రూ.1000 చెల్లించనున్నట్లు బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) సభ్యుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వేడచందూరు ఎమ్మెల్యే గాంధీరాజన్ దిండుగల్ జిల్లాల్లో కలైంజర్ మహిళా సాధికారిక నగదు పథకం కింద లబ్దిపొందనున్న గృహిణుల సంఖ్య వెల్లడించాలని కోరారు.
ఈ వార్తను కూడా చదవండి: Mosquito control : ఆడ దోమల అంతానికి.. మగ దోమల్లో విష జన్యువు
ప్రత్యేక పథకాల మంత్రిత్వ శాఖ కూడా నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎం(Deputy CM) సమాధానమిస్తూ... దిండుగల్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 5లక్షల 27 మందికిగాను 4లక్షల 897 మందికి ప్రతినెలా రూ.1000లను చెల్లిస్తున్నట్లు తెలిపారు. వేడచందూరు నియోజకవర్గంలో ఈ పథకం ద్వారా 62 వేలమంది గృహిణులు లబ్దిపొందుతున్నారని, ఇక రాష్ట్రమంతటా కోటి 63లక్షల 57వేల 195 మంది దరఖాస్తు చేయగా, వాటిలో కోటి 6 లక్షల 52 వేల 198 మందికి నగదు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసిన గృహిణులకు కూడా వచ్చే మార్చిలోపున ప్రతినెలా రూ.1000లను చెల్లించనున్నామని తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్
ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు
Read Latest Telangana News and National News