Home » Ponnam Prabhakar
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. కేంద్ర క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నందుకు ముందుగా బండి సంజయ్‌కు పొన్నం శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని లేఖలో కోరారు.
హైదరాబాద్‌లో భారీ వర్ష సూచనలపై ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి వచ్చే ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ అనాథలా మారిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా తూర్పు నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌లోని ఐఐసీ భవన్‌కు గురువారం వచ్చిన ఆమె తన చాంబర్లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో బాధ్యతల స్వీకరణ పత్రంపై సంతకం చేశారు.
హైదరాబాద్ ఈమేజ్‌ని డ్యామేజ్ చేసేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు.