Ponnam Prabhakar: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కి ఏం తెచ్చాడు
ABN , Publish Date - Jul 11 , 2024 | 03:40 PM
హైదరాబాద్ ఈమేజ్‌ని డ్యామేజ్ చేసేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్ ఈమేజ్‌ని డ్యామేజ్ చేసేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి మాటలను ఖండిస్తున్నానని అన్నారు. హైదరాబాద్‌కి ఆయన ఏం తెచ్చారని ప్రశ్నించారు. ఈరోజు(గురువారం) మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నగరాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాగానే హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా కలిశానని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని.. ఆయన పెద్ద అసమర్థుడని విమర్శలు చేశాడు.
హైదరాబాద్ అస్తవ్యస్తం కావడానికి కేటీఆర్‌నే కారణమని ధ్వజమెత్తారు. ఉద్యోగ క్యాలెండర్ తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటి వరకు ప్రశ్నించి, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని అనడం భావ్యం కాదని చెప్పారు. రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని సూచించారు. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మాటిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు వినియోగించిన భాషను తాము వాడమని అన్నారు. తాము వాడాలనుకుంటే నాటు భాష మాట్లాడగలమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో చదువుకున్న వాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు ఉన్నారని.. తాము విజ్ఞతతో ఉంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
KTR: ‘ఈమహా నగరానికి ఏమైంది?’.. కేటీఆర్ షాకింగ్ ట్వీట్
Sridhar Babu: బురద చల్లడం ఆపి.. ఓటమిని సమీక్షించుకోండి
Read Latest TG News And Telugu News