Home » Ponnam Prabhakar
జగిత్యాల: మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్? అంటూ ప్రశ్నించారు.
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మొబైల్ ఫోన్‌తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయన సంభాషణల ఆడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో పొన్నంకు ఫోన్ గండం ఉందనే టాక్ నడుస్తోంది.
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్‌పై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ, రెడ్డి, వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ టికెట్‌ను హైకమాండ్ మళ్లీ పెండింగ్‌లోనే పెట్టింది. ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు మధ్య పోటీ నెలకొంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తారంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. సోమవారం నాడు జహీరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు.
హైదరాబాద్: ఉచిత బస్సులలో ఇప్పటి వరకు 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే
కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డలో రెండే పిల్లర్లు కుంగాయాని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Telangana: జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్‌తో పాటు, వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ సమస్యలను మంత్రి దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రెండు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసిన సర్కార్.. ఇటీవల పేదలకు ఎంతగానో ఉపయోగపడే రూ.500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేసింది. ఇప్పుడు తాజాగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తుముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మ - నరేందర్ , వంద మందికి పైగా ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేశారు.