Minister Uttam : కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం
ABN , Publish Date - Dec 06 , 2024 | 07:08 PM
కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
సూర్యాపేట : కాంగ్రెస్ హయాంలోనే విద్యావ్యవస్థ పటిష్టమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ (శుక్రవారం) చిలుకూరు మండలం సీతారామపురంలో రూ.300 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూలుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శంకుస్థాపన చేశారు. అలాగే దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ...తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కేసీఆర్ హయాంలో విద్యవ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయమనే నినాదంతో ముందుకు కొనసాగుతున్నామని అన్నారు. ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడంలో భాగంగానే 800 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ను మిర్యాలగూడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తుండటం సంతోషదాయకమని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఈ సంవత్సర కాలంలో ఇరిగేషన్, విద్యుత్ రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి పొన్నం ప్రభాకర్
గురుకుల, డీఎస్సీ బోర్డుల ద్వారా విద్యార్థులకు న్యాయమైన విద్య అందించేందుకు ఉద్యోగాల భర్తీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.కోట్లు ఖర్చైనా విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సమీకృత పాఠశాలతో నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో వరి సాగు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి ఉత్తమ్ హయాంలో హుజూర్ నగర్, కోదాడ అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో వరి సాగు జరిగిందని అన్నారు. గురుకులాల్లో అరకొర వసతులను అధిగమించడానికి సమీకృత పాఠశాలల నిర్మాణం చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా
CM Revanth Reddy: కేసీఆర్! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్
KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా
Read Latest Telangana News And Telugu News