Home » Pressmeet
నెల్లూరు: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉండే కారు, పాస్ పోర్టు చిక్కాయని, తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: కొత్తగా నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి.
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రూ. 4 వేల నుంచి రూ. 5 వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టిందని, ఇన్ని కోట్ల డబ్బులు వైసీపీకి ఎక్కడ నుంచి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు.
హనుమకొండ: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రాత్మకమని, 35 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ప్రజాప్రతినిధులు లేరని, అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిందని వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.
గుంటూరు జిల్లా: కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని, మోదీ డబుల్ ఇంజన్ అని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.. డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కామెంట్స్ చేశారు.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కృష్ణాజిల్లా, గుడివాడ: ఓటర్లకు డబ్బులు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ సీనియర్ వైసీపీ మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. డబ్బు కాజేసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: 125 నుంచి 150 స్థానాల్లో కూటమి గెలుస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
విశాఖ: వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.