Share News

TDP: జగన్ ‘మాడా’ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

ABN , Publish Date - Nov 08 , 2024 | 07:41 AM

వైఎస్సార్ భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిళపై భారతీరెడ్డి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిగ్గుతో తల దించుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

TDP: జగన్ ‘మాడా’ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా: అసెంబ్లీ (Assembly) సాక్షిగా ఆనాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు (Chandrababu)ని, ఆయన కుటుంభ సభ్యులను వైసీపీ సభ్యులు (YCP Activists) అతి జుగుప్సాకరంగా మాట్లాడుతుంటే (Comments) వికటాట్టహాసం చేసిన జగన్ రెడ్డి (Jagan Reddy) నేడు అమాయకంగా ‘మాడా ’ మాటలు మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు (Kanaparthi Srinivasa Rao) అన్నారు. ‘‘మీరు మహానేతగా పిలుచుకునే వైఎస్సార్ భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిళపై భారతీరెడ్డి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిగ్గుతో తల దించుకోవాలన్నారు.

కాగా వైసీపీ నేత కళ్లెం హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత పరిటాల శ్రీరాంపై ‘తొడగొట్టి నీ అంతు చూస్తానంటూ’ సవాల్ విసిరారు. ఆ సందర్భంగా పరిటాల శ్రీరాంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. వైసీపీ సోషల్ మీడియా ఆగడాలపై ఫోకస్ పెట్టిన కూటమి సర్కార్ వరుస అరెస్టులతో దూకుడు పెంచింది.


‘కూటమి’ నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియాలో కాలకూట విషం చిమ్మిన వర్రా రవీంద్రా రెడ్డి.. అతడిపై రాష్ట్రవ్యాప్తంగా అనేక కేసులు.. అతడి అరెస్టు కోసం రెండు జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు.. డీఐజీ స్వయంగా పర్యవేక్షించారు.. వర్రా అరెస్టుకు పకడ్బందీ వ్యూహం రచించారు. అయినప్పటికీ... తప్పించుకున్నాడు.. ఇదో గ్రేట్‌ ఎస్కేప్‌.. దీని వెనుక ఎవరున్నారు.. అక్కడేం జరిగింది..

అది... కడప నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్‌. సమయం... మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు. పలువురు ప్రముఖులపై సోషల్‌ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టిన జగన్‌ సతీమణి భారతీరెడ్డి పీఏ, ఎంపీ అవినాశ్‌ అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డి స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నాడు. అంతకంటే బలమైన మరో కేసులో అరెస్ట్‌ చేయడానికి స్టేషన్‌ బయట రాజంపేట పోలీసులు సిద్ధంగా ఉన్నారు. తాలూకా స్టేషన్‌ నుంచి వర్రా రవీంద్రారెడ్డి బయటకు రాగానే అరెస్ట్‌ చేయడమే తరువాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు తప్పించుకునే చాన్సే లేదు. అయినప్పటికీ... పోలీసుల కన్ను కప్పి వర్రా ‘గ్రేట్‌ ఎస్కేప్‌’ అయ్యాడు..! ఇది ఎలా సాధ్యమైంది? లోతుల్లోకి వెళితే సంచలన విషయాలు బయటపడుతున్నాయి.


ఇదీ కేసు నేపథ్యం

వర్రా రవీంద్రా రెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను దూషిస్తూ పోస్టులు పెట్టాడని రేవూరి నరసింహ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ నెల 5న రాజంపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 352, 353(1)సీ, 353(2 బీఎన్‌ఎ్‌స 67, ఐటీఏ 2000 యాక్టుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజున సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వర్రా రవీంద్రారెడ్డి నీచమైన పోస్టులు పెట్టాడంటూ టీడీపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు కడప తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు చిన్నచౌకు సీఐ తేజోమూర్తి ఆధ్వర్యంలో పోలీసు బృందం మంగళవారం వేములకు వెళ్లి అతడిని తీసుకొచ్చారు. కడప తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. అయితే అతడిపై ఇంతకంటే బలమైన కేసు రాజంపేటలో నమోదుకావడంతో, ఆ కేసులో అరెస్ట్‌ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ ఆదేశాల మేరకు కడప పోలీసులు రాజంపేట డీఎస్పీ స్థాయి అఽధికారులకు దీనిపై సమాచారం అందించారు.

నాటకీయ ఫక్కీలో...

మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు రాజంపేటకు చెందిన ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌ రెడ్డి, మరో నలుగురు కానిస్టేబుళ్లు వర్రాను అరెస్టు చేసేందుకు కడపకు చేరుకున్నారు. అతను పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకోవాలన్నది వారి ఆలోచన. అయితే... ఎస్‌ఐ దూరంగా ఉండిపోయి, వర్రాను పట్టుకునే పనిని ఇద్దరు కానిస్టేబుళ్లకు అప్పగించారు. అప్పటికి ఒక న్యాయవాది, మరో అనుచరుడితో కలిసి వర్రా ఠాణాలో ఉన్నాడు. అసలే మహా ముదురు! అరెస్టు కాకుండా ఉండేందుకు అన్నిరకాల ఎత్తులూ వేసే అవకాశముంది! అందుకే... పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వర్రా ఫొటోను ముందుగానే రాజంపేట పోలీసులకు పంపించారు. ఠాణాలో ఉన్న ముగ్గురిలో ఇద్దరిని తొలుత పంపిస్తామని... వర్రాను చివర్లో పంపిస్తామని, అతడిని అదుపులోకి తీసుకోవాలని సమాచారం ఇచ్చారు. తొలుత న్యాయవాదిని బయటికి పంపించారు. అయితే... అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులను గుర్తించిన ఆయన తిరిగి స్టేషన్‌లోకి వచ్చేశారు. అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదుకానీ... వర్రా రవీంద్రారెడ్డి ముందుగా స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే వర్రా ఫొటోను చూసిన పోలీసులు... పోలికలు గుర్తించి అతడిని పట్టుకున్నారు. ‘నేను పత్రికా విలేకరిని. నన్ను ఎందుకు ఆపారు’ అని దబాయించడంతో వదిలేశారు. తర్వాత వర్రా రవీంద్రారెడ్డి వెంట వచ్చిన న్యాయవాది బయటకు వచ్చారు. ఆయన్ను కూడా రాజంపేట పోలీసులు ఆపారు. తాను న్యాయవాదినని చెప్పడంతో విడిచిపెట్టారు. తమకు ముందుగా అందిన సమాచారం ప్రకారం... మూడో వ్యక్తి కచ్చితంగా వర్రా అయి ఉంటాడని భావించారు. మూడో వ్యక్తి రాగానే అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు... దూరంగా ఉన్న ఎస్‌ఐ లక్ష్మీ ప్రసాదరెడ్డి అక్కడికి వచ్చారు. తాము పట్టుకున్నది అసలు వ్యక్తిని కాదని గుర్తించారు. అప్పటికే... వర్రా రవీంద్రా రెడ్డి అక్కడి నుంచి కారులో ఉడాయించాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేత హరికృష్ణారెడ్డి అరెస్ట్

గ్రేట్‌ ఎస్కేప్‌

వైసీపీ ‘సైకో ఫ్యాక్టరీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 08 , 2024 | 07:41 AM