Home » Raghurama krishnam raju
న్యూఢిల్లీ: వివేక హత్య కేసులో సీబీఐ ఛార్జిషీట్లో అనేక అంశాలు ఉన్నాయని, వివేక హత్య కేసులో సీబీఐ చేతులు ఎత్తేశారాని సాక్షిలో రాసుకున్నారని, ఐ ఏమో ఓ యాప్ ద్వారా మెసేజ్ చేసినట్టు ఉందని క్లియర్‌గా అందులో రాశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును ఎంపీ ఎంవీవీ ఇష్టం వచ్చినట్లు దూషించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనను చెప్పుకోలేని విధంగా దూషించారని, ఎంపీ వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాశానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.
పార్లమెంటు సెంట్రల్ హాల్లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అసభ్య పదజాలంతో విశాఖ ఎంపీ ఎంవీవీ దండెత్తారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలిశారు. ఈ మేరకు సీఈసీ డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మను కలిసి వైసీపీ సర్కారు చేపడుతున్న దొంగ ఓట్ల వ్యవహారం, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు అందజేశారు. ఆగస్ట్ తొలివారంలో విశాఖలో పర్యటించి రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం అవుతానని డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మ తనకు చెప్పారని రఘురామ వెల్లడించారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. ఎంపీ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని తెలిపారు.
ఢిల్లీ: జగనన్న ఆణిముత్యాలేంటో అర్థం కావడం లేదని, సాక్షికి తప్ప ఎవరికీ లాభం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని.. ఆమె పట్టువదలని వీరవనిత లాగా ముందుకు వెళుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. సీబీఐ విచారణ జూన్ 30 లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ పొడగించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆ వ్యాఖ్యలు తనకు బాధనిపించాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.