Home » Rains
వరద బాధితులకు సహాయం చేయకుండా తమపై బురద జల్లుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సోమవారం నాడు చేగుంటలో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయకుండా..
వరద సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కొట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని..
తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు పడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(సోమవారం) ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ పరిశీలించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు. తన కుమారుడు, కుమార్తె తరఫున కూడా విరాళం ప్రకటించారాయన.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(సోమవారం) సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే (Heavy Rains). ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల థాటికి అతలాకుతలం అయ్యింది. వాగులు, వంకలు ఏకమై పొంగిపొర్లి.. గ్రామాలు, కాలనీల్లోని లోతట్లు ప్రాంతాలను ముంచెత్తాయి...
భారీ వర్షంతో హైదరాబాద్ నగరం చిత్తడిగా మారింది. తేలికపాటి జల్లులకే సిటీలో వరదనీరు పోటెత్తుతోంది. రెండు రోజుల నుంచి భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిజాంపేటలో దాదాపు 10 అపార్ట్ మెంట్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది.
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వర్షాలకు 432రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వస్తున్నారు...