Share News

Jagadish Reddy : భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:14 PM

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

Jagadish Reddy : భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం

సూర్యాపేట: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏం చేశారో ఎవరికి తెలియదని ఆరోపించారు.


ఖమ్మం ఘటనపై ప్రభుత్వ స్పందన లేదు...

ఖమ్మంలో ప్రజలు వరదలో చిక్కి 9గంటలు సహాయం కోసం ఎదురు చూసినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఎందుకు లేదని ప్రశ్నించారు. వరదల నుంచి ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. హెలికాప్టర్ కోసం ఎదురు చూసినా రాలేదని ఓ మంత్రి నిస్సహాయత వ్యక్తం చేశారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా అని నిలదీశారు.


ఆర్మీ హెలికాప్టర్ ఎందుకు అడగలేదు...

భాధ్యత వహించి సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడిన మంత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం అందుబాటులో లేరా? అని నిలదీశారు. సీఎస్ అలెర్ట్‎ను చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉన్నారా అని అడిగారు. సీఎం, మంత్రులు ప్రధానికి ఫోన్ చేసి ఆర్మీ హెలికాప్టర్ కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.


ఇంత ప్రాణనష్టం జరిగేది కాదు..

ప్రభుత్వం నుంచి సరైన అప్రమత్తత ఉంటే ఇంత ప్రాణనష్టం జరిగేది కాదని తెలిపారు. ఒక సైంటిస్ట్‎ను కోల్పోయే వాళ్లం కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ప్రకృతికి అప్పగించిందని విమర్శలు చేశారు. నిన్నటి మరణాలకు కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల సహాయం అందించాలని కోరారు.


ఇవి కూడా చదవండి...

NRI: ముగిసిన ఆప్త 16వ వార్షికోత్సవం

Seethakka: భారీ వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 02 , 2024 | 04:30 PM