CM Revanth Reddy: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 02 , 2024 | 06:59 PM
తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు పడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(సోమవారం) ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ పరిశీలించారు.
ఖమ్మం: తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు పడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(సోమవారం) ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ పరిశీలించారు. కాసేపటి క్రితమే పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాగర్ ఎడమ కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కరుణగిరి హౌసింగ్ బోర్డ్ కాలనీలో..వరద బాధితులను పరామర్శించారు. రాజీవ్ గృహకల్పలో వరద బాధితులకు రేవంత్ పరామర్శించారు.
ప్రకాష్‌నగర్ బ్రిడ్జిని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. నిన్న ప్రకాష్‌నగర్ బ్రిడ్జి దగ్గర చిక్కుకున్న 9 మంది..బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో వరదలపై సమీక్షించారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరద ప్రజల బతుకుల్లో విషాదం నింపిందని చెప్పారు. ప్రజా కష్టాలు తీర్చేందుకు మంత్రులు, అధికారులు..నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
మంత్రి పొంగులేటి నిరంతర సమీక్ష చేస్తున్నారని చెప్పారు. వరదను నియంత్రించేందుకు ఖమ్మంలో రీటైనింగ్..వాల్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వివరించారు. రీటైనింగ్ వాల్ కోసం రూ.650 కోట్లు కేటాయించామని అన్నారు. రీటైనింగ్ వాల్ పూర్తికాకుండానే ఖమ్మంలో వరదలు వచ్చాయని అన్నారు. 70 ఏళ్లలో 40 సెం.మీ. వర్షాన్ని ఖమ్మం ప్రజలు చూడలేదని చెప్పారు. బాధితులకు నిత్యావసరాలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.