Home » Rains
తన సోదరుడి నిశ్చితార్థం కోసం బెంగుళూరు నుంచి స్వగ్రామనికి వచ్చిన మహిళా యువశాస్త్రవేత్త.. తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా వరదలో చిక్కుకొని.. మృతి చెందింది.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఆపరేషన్ డివిజన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తడిసిన కరెంటు స్తంభాలు ముట్టుకోవద్దన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోట మండలం శ్రీనివాససత్రం, గోవిందపల్లిపాళెం సముద్రతీరంలో తహసీల్దారు జయజయరావు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించి పోయింది.
జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. వారంలోనే నలుగురు జ్వరంతో మరణించారు. డెంగీ జ్వరంతో చనిపోయారని కుటుంబసభ్యులు అంటున్నా, జిల్లా వైద్యాధికారులు మాత్రం అవి డెంగీ మరణాలు కావని కొట్టి పారేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత అధ్వానంగా మారింది. దీంతో దోమలు బెడద ఎక్కువైపోయింది. ఇంట్లో, బయట ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా దోమలు దాడి...
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మండలకేంద్రంలో ఎక్కడ చూసినా చిత్తడి చిత్తడిగా మారింది. ప్రధాన రహదారులైన ధర్మవరంరోడ్డు, తాడిపత్రిరోడ్డుతో పాటు వీధులన్నీ నీరు నిలిచి బరదమయంగా మారాయి. నీరు నిలిచినచోట దుర్వాసన వెద జల్లుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వాన పడుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చే ఈసీ కాలువ పొంగిపొర్లుతోంది.
మచిలీపట్నం- విశాఖపట్టణం మధ్య నడిచే 17219 నెంబర్ రైలును సోమవారం రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైలు నెంబర్ 17247 ధర్మవరం- మచిలీపట్నం..
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధింత అధికారులతో సమావేశం అయ్యారు.